బాలయ్య- బోయపాటి హాట్రిక్ దిశగా....
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్లో సూపర్ హిట్ బ్లాక్ బస్టార్ కాంబినేషన్ అనే పేరు బలపడి పోయింది. ఎందుకంటే వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు ‘సింహా', ‘లెజెండ్' భారీ విజయాలు నమోదు చేసారు.
మరి ఇలాంటి కాంబినేషన్ మూడో సారి కలిసి పని చేయడం అంటే హ్యాట్రిక్కే మరి. తాజాగా బోయపాటి బాలయ్య కోసం కథ కూడా సిద్ధం చేసారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా బోయపాటి వెల్లడించడంతో బాలయ్య అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

‘బాలయ్య బాబుతో మూడోసారి కలిసి పని చేయాలనుకుంటున్నాను. ఈ సారి వచ్చే సినిమా ‘సింహా', ‘లెజెండ్' చిత్రాలను మించి పోయే విధంగా ఉంటుంది.' అని బోయపాటి శ్రీను వెల్లడించారు. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
‘సింహా', ‘లెజెండ్' చిత్రాలు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా ఎలా పర్ ఫెక్టుగా సెట్ అయ్యాయో....అందుకు ఏ మాత్రం తీసి పోని విధంగా వీరి మూడో సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం బాలయ్య సత్య దేవా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత హ్యాట్రిక్ మూవీ ఓ కొలిక్కి రానుంది.


Click it and Unblock the Notifications











