సినిమాలు ప్లాప్, భక్తుడిగా మారుతా: రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: దేవుళ్లపై నాకు నమ్మకం లేదని చెప్పుకునే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుండి మారిపోతాను అంటున్నాడు. భక్తిగా మారుతానంటున్నాడు. అతనిలో ఈ మార్పు రావడానికి కారణం అతని సినిమాలు ప్లాప్ కావడమేనంట. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ సందేశం పోస్టు చేసారు. 'దేవుళ్ల పట్ల నా ప్రవర్తన వల్లనే నేను తీసే సినిమాలు ప్లాపవుతున్నాయని అనుకుంటున్నాను. అందుకే భక్తుడిగా మారాలని నిర్ణయించుకున్నాను' అని ట్వీట్ చేసారు.
దీంతో పాటు కొన్ని వివాదాస్పద ట్వీట్స్ కూడా చేసాడు..

-ఈ రోజు గణేషుడి రియల్ పుట్టిన రోజా? లేక వాళ్ల నాన్న అతని తలను నరికిన రోజా?.... ఎవరైనా క్లారిటీ ఇవ్వండి.
-గణేషుడు అతని చేత్తో తింటాడా? లేక తొండంతో తింటాడా?
- ఎవరైనా దయచేసి సమాధానం చెప్పండి...తన తలను తాను కాపాడుకోలేని దేవుడు...ఇతరుల తలలను ఎలా కాపాడుతాడు?
-ఇతర దేవుళ్ల కంటే గణేషుడు ఎక్కువ తింటాడా? నా అనుమానం....ఇతర దేవుళ్లు సన్నగా ఉండటమే.
-కేవలం తన తల్లి దగ్గరకు వెళ్లక పోనివ్వడం వల్లనే తల నరికేస్తారా? అలా ఎందుకు జరిగింది...ఎవరైనా కాస్త క్లారిటీ ఇవ్వండి. భక్తులకు ఈ విషయం బాగా తెలుసని అనుకుంటున్నాను.
-గణేషుడిపై నా వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. భక్తుల మనో భావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ చెబుతున్నాను.


Click it and Unblock the Notifications











