ఆ కోరిక తీర్చడానికే బాయ్ ఫ్రెండ్ అంటున్న తాప్సి
హైదరాబాద్: హీరోయిన్ తాప్సి తరచూ ఏదో ఒక రూమర్‌తో వార్తల్లో నిలుస్తున్న సంగతి. ఆమెకు ఆ హీరోతో ఎఫైర్ ఉందని, ఈ హీరోను ప్రేమిస్తుందనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తన జీవితంలో ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని స్పష్టం చేసింది తాప్సీ. భవిష్యత్‌లో కూడా ఎవరినీ ప్రేమించబోనని అంటోంది.
అయితే బాయ్ ఫ్రెండ్ లేని వెలితి తనకు ఏదో ఒక రోజు కలుగుతుందని అంటోంది తాప్సీ. 'ప్రేమికుల దినోత్సవం రోజు మాత్రం నాకొక బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రోజు లవర్స్ బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిలోకంలో వారు గడుపుతుంటారు. ఇలాంటివి అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ కోరిక తీరడానికైనా....ఆ ఒక్క రోజు బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటున్నాను' అంటోంది తాప్సి.

ఇంతే కాదు...గతంలో పెళ్లి గురించి కూడా తాప్సీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ''అగ్ని సాక్షిగా' అని చెప్పి ఎవరో ముక్కూ మోహం తెలీని వ్యక్తితో ఏడడుగులు వేయమనడం నిజంగా అన్యాయం. నా దృష్టిలో అది పెళ్లే కాదు. ఒకర్ని గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నవారే నా దృష్టిలో పెళ్లికి అర్హులు. నా వరకూ నేను పెళ్లాడాలనుకుంటే... ముందు సదరు వ్యక్తితో రెండేళ్ల పాటు సహజీవనం చేస్తాను. తన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుంటాను. తను సరైనవాడే అని నమ్మకం కుదిరాకే పెళ్లి. అయితే... సహజీవనం నెపంతో తప్పులు చేసే వ్యక్తిత్వం కాదు నాది. నా తల్లిదండ్రులు నా చుట్టూ గీచిన గీతను ప్రాణం పోయినా దాటను'' అని చెప్పారు తాప్సీ.
అలాగే... ''ప్రపంచ దేశాలన్నీ తలవంచి గౌరవించే మన వివాహవ్యవస్థపై నాకు మాత్రం నమ్మకం లేదు'' అని సంచలన వాఖ్యలు చేశారు ఢిల్లీ భామ తాప్సీ. తెరపై అమాయకంగా కనిపించే తాప్సీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అందరినీ షాక్ కి గురి అయ్యేలా చేసింది.


Click it and Unblock the Notifications











