twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకత్వమా.. సారీ! చేతులెత్తేసిన నటుడు

    By Srikanya
    |

    న్యూఢిల్లీ: 'దర్శకత్వమా... సారీ..! నటుడిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజలకు సినిమాల ద్వారా తెలియజెప్పాలనుకున్న విషయాలను తెలియజెప్పేందుకు ఆ సినిమాలకు స్వయంగా నేనే నిర్మాతగా వ్యవహరించాను. అందులో కూడా సంతృప్తి మిగిలింది. ఇక దర్శకత్వం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా'అని పరేష్ రావెల్ చెప్పాడు. నటుడిగా, రంగస్థల నటుడిగా, నిర్మాతగా సంతృప్తికరమైన ప్రదర్శనను కనబర్చినా దర్శకత్వం జోలికి వెళ్లనని పరేశ్ రావల్ అన్నారు. పరేశ్ రావల్ త్వరలో దర్శకుడిగా అవతారమెత్తనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించాడు.

    టీవీలో కూడా 'తీన్ బహురాణియా', 'లగీ తుఝ్‌సే లగాన్' షోలకు నిర్మాతగా పరేష్ రావెల్ వ్యవహరిస్తున్నాడు. సినిమాల్లో 'ఓ మై గాడ్' సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

    'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి దేముడు విగ్రహాలు తయారు చేసి అమ్మే యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని షాపు భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది గాడ్స్ యాక్ట్ (భగవంతుడు పని) కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

    భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ఓ మై గాడ్‌'లో అక్షయ్ ఆధునిక శ్రీకృష్ణునిగా కనిపించాడు. పరేష్‌రావల్‌ ఓ కీలక పాత్ర చేసిన ఈ సినిమాని అశ్వనీ యార్ది దర్శకత్వం వహించగా గ్రేజింగ్‌ గోట్‌బ్యానర్‌పై అక్షయ్ స్వయంగా నిర్మించాడు. ఈ కథ ప్రధానంగా నాస్తికుడిగా నటిస్తున్న పరేష్‌రావల్‌ చుట్టూ నడుస్తుంది. ఓ కేసు విషయమై అతను శ్రీకృష్ణుడిని ఎలా కోర్టుకి లాగుతాడు, కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడన్నది కథ. ఓ గుజరాతీ నాటకం దీనికి ఆధారం. తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి నిర్మాత కృష్ణప్రసాద్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఆయనతో పాటు అక్షయ్, యార్ది కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశా లున్నాయి.

    English summary
    "I am happy as an actor, I won't turn director. I am not cut out for direction in my mindset," Paresh told. He has been involved in the production of TV shows like "Teen Bahuraaniyaan" and "Laagi Tuzhse Lagan". Recently, he ventured into film production with " Oh My God", based on his Gujarati play.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X