అల్లు అర్జున్-నానిలతో...గౌతం మీనన్ మల్టీస్టారర్ మూవీ!

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ మూవీ జోరు ఊపందుకుంటోంది. ప్రస్తుతం వెంకటేష్-మహేష్ బాబు కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూపొందుతుండగా, హిందీ చిత్రం 'బోల్ బచ్చన్' రీమేక్ గా విక్టరీ వెంకటేష్-ఎనర్జిటిక్ స్టర్ రామ్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజాగా 'ఎటో వెళ్లి పోయింది మనసు' దర్శకుడు గౌతం మీనన్ కూడా మల్టీ స్టారర్ చిత్రం చేయాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఓ ఇంట్వ్యూలో గౌతం మీనన్ మాట్లాడుతూ తన మనసులోని మాటను బయట పెట్టారు. ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలో జోరందుకున్నాయి. మీరు మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎవరితో చేస్తారు? అనే ప్రశ్నకు గౌతం మీనన్ స్పందిస్తూ....'అల్లు అర్జున్-నానిలతో త్రిబాషా చిత్రంగా లవ్ అండ్ యాక్షన్ స్టోరీతో సినిమా సినిమా చేస్తా' అంటూ సమాధానం ఇచ్చారు.

గౌతం మీనన్ ఆలోచన చూస్తుంటే....వారి స్టార్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని ఆయన ఇలా వ్యాఖ్యానించినట్లు స్పష్టం అవుతోంది. అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కేరళల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. నాని కూడా తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు పరిచయమే. తనకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి పేరు ఉండటంతో వీరితో సినిమా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన భావన కాబోలు.

ఇతర విషయాల్లోకి వెళితే....గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలే సాధిస్తోంది. సినిమా స్లోగా ఉందనే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా రిజల్ట్ బాగానే ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X