గతాన్ని మర్చిపోతే చితి మీద శవంతో సమానం: మోహన్ బాబు!??
మోహన్ బాబు మొహమాటం లేకుండా..ముక్కుసూటిగా మాట్టాడతారన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని వుందని సభా పూర్వకంగా అడిగారు. 500 పైగా సినిమాల్లో నటించానన్న ఇగో ఎక్కడా కనిపించదు ఆయనలో. పంచాక్షరిలో ఒక పాత్రను ఇమ్మని నిర్మాత చంద్రను అడిగారు.
పంచాక్షరి ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 'మనం ఎంత మంచి పొజిషన్ కు వెళ్ళినా డబ్బు, కారు, హోదా వచ్చినా..గతాన్ని మర్చిపోకూడదు. అలా మరచిపోతే..చితి మీద శవంతో సమానం అని అన్నారు. చంద్ర నాకు 20 సంవత్సరాలుగా తెలుసు ఆయన ఒక మంచి పొజిషన్ లోకి వచ్చినా..గతాన్ని మర్చిపోకుండా..బంధువులకు, శ్నేయోభిలాషులకు అండగా ఉంటున్నాడు. ఉపయోగపడుతున్నాడు. అంత మంచి వ్యక్తి సినిమా తీస్తుంటే ఏదైనా వేషం ఉందా ఫ్రీగా నటిస్తానని అడిగాను. కానీ వాళ్లు ఇవ్వలేదు" అంటూ పంచాక్షరి సక్సెస్ కావాలని చంద్రను ఆశీర్వదించారు.
మోహన్ బాబు కృష్ణవంశీ పంచాక్షరి చంద్ర అనుష్క నాగార్జున కె రాఘవేంద్ర రావు. mohan babu krishna vamsi panchakshari chandra anushka nagarjuna k raghavendra rao


Click it and Unblock the Notifications