Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
చంద్రబాబుకు మోడీ ఆ మాట అంటే సమస్యలేదు... నా సినిమాతో సమస్యా- ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'వెన్నుపోటుదారుడు' అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు... కానీ నేను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తే సమస్యగా ఫీలవుతున్నారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
తాజాగా వర్మ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ వారు తమ అధినేత చంద్రబాబును మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పోడిచిన వ్యక్తిగా... తాను తీస్తున్న సినిమాలో చూపిస్తున్నట్లు భావిస్తున్నారని, అందుకే వారు సినిమాను అడ్డుకోవడంలో భాగంగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారని తెలిపారు.
ప్రధానితో లేని సమస్య నా సినిమాతోనా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గుంటూరు సభలో... చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచాడు అని ఆరోపించారు. ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చేసినవ్యాఖ్యలు ఓటర్లపై, ఎన్నికలపై ప్రభావం చూపనపుడు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఓటర్లపై, ఎన్నికలపై ఎలా ప్రభావం చూపుతుంది? అని ఆర్జీవి ప్రశ్నించారు.
ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు... 25 ఏళ్ల క్రితం జరిగిన నిజం!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి వైసీపీ నిధులు సమకూర్చింది అనే విషయంలో ఎలాంటి నిజం లేదని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. తాను తీసిన సినిమా టీడీపీకి వ్యతిరేకం, మరో పార్టీకి అనుకూలం అనే ప్రస్తావనే లేదు. 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక నిజాన్ని తన సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఎవడి సొమ్ము అది, అహంకారం పనికిరాదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ మోహన్ బాబు!
బాలయ్య వల్లే ఈ సినిమా ఆలోచన
ఎన్టీఆర్ బయోపిక్ చేయాలని బాలయ్య మొదట నన్ను కోరిన మాట నిజమే. అయితే ఆతడు చెప్పిన సబ్జెక్ట్ నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఈ క్రమంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని వర్మ తెలిపారు.
లేకుంటే ఐడియా వచ్చేది కాదు, ఆయనకే అంకితం
ఎన్టీఆర్ బయోపిక్ అంశంతో బాలయ్య నన్ను సంప్రదించి ఉండకపోతే నాకు ఈ సినిమా ఐడియా వచ్చేది కాదు. అందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఈ చిత్రాన్ని బాలయ్యకు అంకితం చేయాలనుకుంటున్నట్లు ఆర్జీవి తెలిపారు.