నాగార్జునపై కోరికను బయటపెట్టిన అనుష్క!
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన జంటల్లో నాగార్జున-అనుష్క ముఖ్యలు. తెరపైనే తమ రొమాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వీరి మధ్య నిజ జీవితంలోనూ 'సం'బంధం ఉన్నట్లు ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి కామెంట్లను పట్టించుకోకుండా వరస సినిమాల్లో కలిసి నటిస్తూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.
తాజాగా అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నాగార్జునతో కలిసి పని చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. నా వరకు ఆయన ఒక గొప్ప టీచర్. నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. కెరీర్‌కి సంబంధించి ఏది మంచి, ఏది చెడు అనేది ఆయనే నేర్పించారు. నాగార్జున గారే నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.
'అరుంధతి తర్వాత తాను చేస్తున్న మరో పవర్ ఫుల్ రోల్ 'రుద్రమదేవి'. ఈచిత్రం తనకు అరుంధతి రేంజిలో పేరు తెస్తుందనే నమ్మకం ఉంది' అని అనుష్క వెల్లడించింది. ప్రస్తుతం తనకు పలు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నా... సౌతో బిజీగా ఉండటం వల్ల చేయడానికి ఇంట్రస్టు చూడపం లేదని తెలిపింది. తాను గత సంవత్సరం ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఆలస్యం కావడం వల్లనే తెలుగు సినిమాలకు గ్యాప్ వచ్చిందని, తాను టాలీవుడ్ సినిమాలకు కావాలని దూరంగా ఉంటున్నాననే వార్తల్లో నిజం లేదని అనుష్క స్పష్టం చేసింది.
ఇటీవల 'డమరుకం' చిత్రంలో తన అందచందాలతో అలరించిన అనుష్క త్వరలో కార్తి 'బ్యాడ్ బాయ్', ప్రభాస్ 'మిర్చి' చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. మరో వైపు ఆమె ఆర్యతో చేస్తున్న 'బృందావనంలో నందకుమారుడు', సూర్యతో చేస్తున్న సింగ్-2 చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే 'రాణి రుద్రమ దేవి' మూవీ షూటింగ్ 2013లో మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











