Don't Miss!
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి: పెళ్లిపై అనుష్క తల్లి ఆసక్తికర కామెంట్స్!
Recommended Video
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా ఇటు మీడియాలో, అటు అభిమానులు, ప్రేక్షకుల్లో చర్చ సాగుతోంది. కొన్ని రోజుల క్రితం ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రభాస్, అనుష్కతో పాటు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సైతం ఈ వార్తల్లో నిజం లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తేల్చి చెప్పారు. ఎన్ని సార్లు ఖండించినా మళ్లీ మళ్లీ ఈ రూమర్స్ ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి ఓ క్లారిటీ ఇచ్చారు.
అనుష్క పెళ్లి గురించి పూజలు
ఒక తల్లిగా తన కూతురు అనుష్కకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్న ప్రఫుల్లా వెట్టి ఆలయాల్లో పూజలు సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం మీడియాకు చిక్కాయి.
ప్రభాస్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ అల్లుడుగా కావాలి
ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రఫుల్లా శెట్టి స్పందించారు. ‘ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. నాకు కూడా ప్రభాస్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ అనుష్కకు భర్తగా దొరికాలని ఉంది, కానీ వారిద్దరూ స్నేహితులు మాత్రమే. పెళ్లి చేసుకునే ఆలోచన వారికి లేదు. ఇకనైనా ఈ రూమర్స్‌కు తెరదించండి' అని వ్యాఖ్యానించారు.
అనుష్క సైతం తేల్చి చెప్పింది
ప్రభాస్‌ను పెళ్లాడబోతున్నట్లు వస్తున్న వార్తలను అనుష్క సైతం గతంలో ఖండించారు. బాహుబలి-దేవసేన కెమిస్ట్రీ నిజ జీవితంలో ఆశించవద్దు. అది కేవలం సినిమాకే పరిమితం. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం లేదని అని తేల్చి చెప్పారు.
మరి ఎవరిని పెళ్లాడబోతున్నారు?
అటు ప్రభాస్‌తో పాటు ఇటు అనుష్క కూడా పెళ్లి వయసు దాటి చాలా ముందుకు వెళ్లారు. తాము ఇద్దరం పెళ్లి చేసుకోవడం లేదని చెబుతున్న ఈ స్టార్స్.... ఎవరిని పెళ్లాడబోతున్నారు? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా? అనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.
సినిమాల విషయానికొస్తే..
సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో' మూవీ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. అనుష్క ‘భాగమతి' తర్వాత ఏ సినిమాకు కమిట్ కాలేదు. త్వరలో ఆమె చంద్రశేఖర్ యేలేటి తీయబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.