తండ్రి బాటలో సంపాదన దిశగా నాగ చైతన్య!
హైదరాబాద్: నటుడు నాగార్జున...కేవలం నటుడు మాత్రమే కాదు, తెలివైన బిజినెస్ మేన్ అనే విషయం తెలిసిందే. అందుకే ఆయన ఆయన కేవలం సినిమాల్లో నటించడానికే పరిమితం కాకుండా సినిమాలు, సీరియళ్ల నిర్మాణం, స్పోర్ట్స్ ఫ్రాంచైజీలలో భాగస్వామ్యం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి చేతి నిండా సంపాదిస్తున్నారు.
తాను మాత్రమే కాదు...తన వారసులను కూడా సినిమాలకే పరిమితం చేయకుండా ఇప్పటి నుండి వారికి వ్యాపార పాఠాలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకుంటున్న తన కుమారుడు నాగ చైతన్యను భవిష్యత్‌లో సినిమా నిర్మాతగా మర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాన్న సూచన మేరకు సినిమా నిర్మాణ రంగం గురించి తెలుసుకుంటున్నానని, భవిష్యత్‌లో సొంత బేనర్లో సినిమాలు నిర్మిస్తానని నాగ చైతన్య చెబుతున్నాడు. నిర్మాతగా మారాలంటే అన్ని విభాగాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.
మనం చిత్రానికి మంచి ఆదరణ దక్కడంపై నాగ చైతన్య సంతోషం వ్యక్తం చేసారు. తమ్ముడు అఖిల్ ఈ సినిమాలో స్క్రీన్ ఇంట్రీ ఇవ్వడంపై స్పందిస్తూ...అఖిల్ బాగా చేసాడు, అంతరం కలిసి ఒకే సినిమాలో కనిపించడం గొప్పగా ఉంది. దర్శకుడు విక్రమ్ కుమార్ వల్లనే ఇది సాధ్యమైంది అన్నారు.
ప్రస్తుతం 'ఒక లైలా కోసం' చిత్రంలో నటిస్తున్నట్లు నాగ చైతన్య వెల్లడించారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూలై చివర్లో లేదా ఆగష్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య సినిమాపై స్పందిస్తూ..సినిమా విడుదల ఆలస్యం అవ్వడం భాదాకరమైన విషయం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. సినిమా ఎప్పుడు విడుదలైనా డౌట్ లేకుండా హిట్ అవ్వడం మాత్రం ఖాయం అని' అన్నాడు.


Click it and Unblock the Notifications











