మా పైలెట్‌ను గౌరవంగా చూడండి: పాకిస్థాన్ ప్రెసిడెంటుకు నాగబాబు విన్నపం
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూలి పోవడం, పైలట్ అభినందన్ ప్రాణాలతో పాకిస్థాన్ సైన్యానికి చిక్కడం తెలిసిందే. ఈ ఘటనపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.
యుద్ధంలో వీరమరణం పొందితే అదొక గొప్ప విషయం. అలాంటి సైనికులు పోయినపుడు బాధ కలిగినా.. వారి సేవలను, గొప్పతనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కానీ యుద్ధ రంగంలో శత్రువులకు బందీగా చిక్కడం అనేది బాధాకరమైన విషయం. మన పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి ఖైదీగా దొరికిన విషయం తెలిసి బాధేసిందని నాగబాబు వ్యాఖ్యానించారు.

అభినందన్‌ను విడిపించుకోవడం మన బాధ్యత
ఇండియన్స్‌గా మన అందరి బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బాధ్యత అతడిని రిలీజ్ చేయించుకోవడం. ఈ మేరకు అందరూ పాకిస్థాన్ మీద ప్రెజర్ పెట్టాలి. ఒక వేళ ఈ ప్రాసెస్ లేట్ అయితే... కనీసం ఆ పైలెట్, అతడి డిగ్నిటీని తగ్గకుండా గౌరవంగా చూసుకోవాలి. యుద్ధం ఖైదీకి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అది ఇవ్వాలి.

పాకిస్థాన్‌కే బ్యాడ్ నేమ్
విజువల్స్ చూస్తుంటే ఆయన ముఖం అంతా రక్తసిక్తం అయిపోయి ఉంది. చాలా బాధగా ఉంది. ఈ విషయం మనకు తెలిక పోయి ఉంటే.. ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు. ఈ రోజు టెక్నీలజీ పరంగా అడ్వాన్డ్స్ గా ఉన్న సొసైటీలో ఇలాంటివన్నీ ఈజీగా బయటకు వస్తున్నాయి. దీని వల్ల పాకిస్థాన్‌కు ఇంకా బ్యాడ్ నేమ్ తప్ప మంచి పేరు కాదు.

అప్పటి వరకు గౌరవంగా చూసుకోవాలి
ప్రభుత్వాలు ఈ ప్రాసెస్ పూర్తి చేసుకుని.. ఖైదీల ఎక్స్‌చేంజ్ జరిగినపుడు తప్పనిసరిగా అభినందన్‌ను వెనక్కి పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు పైలట్ అభినందన్ గౌరవం తగ్గకుండా ఒక యుద్ధం ఖైదీకి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవం ఇవ్వాలి. ఫిజికల్, మెంటల్ హరాస్మెంట్ చేయకూడదనే విషయం పాకిస్థాన్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
పాకిస్థాన్ ప్రధానికి విన్నపం
సార్ ఇమ్రాన్ ఖాన్ గారు మీరు పాకిస్థాన్ ప్రెసిడెంట్. మీకు తెలుసు ఇండియన్ మర్యాదలు ఎలా ఉంటాయో? భారత దేశానికి మీరు క్రికెట్ కెప్టెగా వచ్చినపుడు ఇక్కడ మిమ్మల్ని చాలా మంది అభిమానించారు. దయచేసి ఈ విషయంలో మీరు కటువుగా ఉండొద్దు. పాకిస్థాన్ అధిపతిగా మీరు ఉన్నాసరే మీపై ఇంకా క్రికెటర్ గానే మీరంటే చాలా గౌరవం ఉంది. మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకెవాలి, మీ అభినందన్ గారిని డిగ్నిటీగా, రెస్పెక్ట్ గా చూడండి.. అని నాగబాబు విన్నవించారు.


Click it and Unblock the Notifications











