ఎప్పుడూ కిక్కులోనే ఉంటా, ఇక మందెందుకు: ఎన్టీఆర్
ఎన్నికల ప్రచారం సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మందు కొట్టి నడపడం వల్లనే కారు ప్రమాదం జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఒక టీవీ చానల్ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రస్తావన రాగా ఆయన చాలా తెలివిగా స్పందించారు. మందంటే తనకు పడదని అన్నారు. మందు కొట్టి అతిగా వాగే వాళ్ళన్నా తనకు నచ్చదని చెప్పారు. యాక్సిడెంట్ జరిగిన రోజున తాను తాగి ఉంటే అనెస్ధీషియా (ఆపరేషన్ చేసే ముందు ఇచ్చే మత్తుమందు) ఎందుకు ఇస్తారని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.
ఆయన మాటల్లోనే చదవండి "ఆ వీడియో చూశారా.. నేను తాగానా...పక్కన వాళ్లంతా అలా గ్లాసులు సిప్ చేశారు. కంత్రిలో ఓ డైలాగ్ ఉంది.. మందు తాగకుండానే కిక్‌లో ఉంటానని..నాది ఆ టైప్. ఏదో ఒకటి మాట్లాడేద్దామనుకునే వారు చాలా మందే ఉన్నారు. నేను తాగి ఉంటే ఎనస్తీషియా ఎందుకిస్తారు.. నేను అబద్దాలు ఆడను. శుభ్రంగా భోంచేశాం. అంతే కనురెప్ప మూసేలోగా జరిగిపోయిందంతే..తాగితే నాకెందుకో పడదు." అన్నారు.


Click it and Unblock the Notifications











