చిరంజీవిని పొగడకుంటే ఇండస్ట్రీలో ఉండలేరా: కమెడియన్‌ను ప్రశ్నించిన ఐఏఎస్

ప్రియదర్శి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో అద్భుతమైన కామెడీని పండించిన ఈ యంగ్ కమెడియన్.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. దీంతో ప్రియదర్శి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక, ఈ మధ్య 'మల్లేశం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ప్రియదర్శి నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. ఈ నేపథ్యంలో అతడు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు.

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి.. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో సినీ దిగ్గజాలంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సహా పలువరు నేతలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే.. పలువురు సినీ ప్రముఖులకు అవార్డులను బహుమతి చేశారు. దీనికి చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 IAS Question To Priyadarshi about Megastar Chiranjeevi

ఇదే వేదికలో చిరంజీవితో ప్రియదర్శి ఓ ఫొటోను దిగాడు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'నా జీవితంలో నేను దిగిన బెస్ట్ సెల్ఫీ ఇదే' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఆ తర్వాత ప్రియదర్శి.. మెగాస్టార్ చిరంజీవితో దిగిన మరో ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు, 'సదా మీ ఏకలవ్య శిష్యుడిని' అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ పోస్టుపై నరహరి అనే ఐఏఎస్ స్పందించారు. 'బ్రదర్ @priyadarshi_i.. నేను చిరంజీవిగారి రుద్రవీణ చూసి ఐఏఎస్ అధికారి కావాలనుకున్నాను. మీరు కూడా మంచి యాక్టర్ (మల్లేశం ఫిల్మ్ తో నిరూపించుకున్నారు). శుభాభినందనలు. కానీ చిరంజీవిని పొగడకుంట సినీ ఫీల్డ్ లో ఉండడం కష్టమా బ్రదర్!' అని ప్రశ్నించాడు. దీనికి ప్రియదర్శి రిప్లై అయితే ఇవ్వలేదు కానీ లైక్ మాత్రం కొట్టడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X