IBomma Ravi: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. కఠినమైన షరతులు ఏమిటంటే?

పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ (IBomma) నిర్వాహకుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవికి ఊరట లభించింది. సైబర్ చట్టాలకు విరుద్దంగా సినిమాలను పైరసీ చేస్తున్న ఆయనను ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం.. రిమాండ్‌పై జైలుకు పంపించడం తెలిసిందే. అయితే ఈ కేసులో కొద్ది నెలలుగా రిమాండ్‌పై ఉన్న ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌కు తెలంగాణ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసు వివరాలు, ఐ బొమ్మ రవికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

విదేశాల్లో తలదాచుకొని తెలుగు, ఇతర సినిమాలను యదేఛ్చగా పైరసీ చేస్తూ నిర్మాత, దర్శకులకు నిద్రలేని రాత్రులను సృష్టించిన ఐ బొమ్మ రవిని పక్కా ప్లాన్‌తో స్కెచ్ వేసి పట్టుకొన్నాడు. ఆయన తన భార్యతో విభేదాల కారణంగా హైదరాబాద్‌కు వస్తున్నారనే సమాచారంతో అలర్ట్ అయ్యారు. తన భార్యకు విడాకులు ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సైబర్ పోలీసులు నవంబర్ 15వ తేదీన అరెస్ట్ చేశారు. కొద్ది రోజులు పోలీస్ కస్టడీలో విచారించిన తర్వాత ఆయనను జుడిషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లోనే ఉండటం తెలిసిందే.

IBomma Ravi Bail

అయితే సినిమా పైరసీ, బెట్టింగ్ అడ్వర్టయిజ్‌మెంట్ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్ కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66C, 66ఈ, కాపీరైట్ యాక్ట్ 318 (4), సెక్షన్ 63, 65 కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్‌పై ఉన్న ఆయనను పలుమార్లు కోర్టులో హాజరుపరిచి విచారించారు. చివరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ విచారించిన అనంతరం బెయిల్ మంజూరు చేసింది.

ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు కొన్ని షరుతులను విధించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. ఆయన పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలి. ప్రతీ రోజు ఉదయం 11 గంటలకు ఆయన సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కండీషన్స్‌లో ఏ ఒక్కటి ఉల్లంఘించిన కఠినమైన శిక్షతోపాటు బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. ఈ షరతులకు అంగీకరించడంతో రవికి బెయిల్ మంజూరైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X