ఐస్ క్రీం- 2 ఇరవై ఫస్ట్ లుక్స్, నెలకో ఐస్ క్రీమ్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో 'ఐస్ క్రీమ్-2' చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఎఫ్.సి, భీమవరం టాకీస్ బేనర్లపై తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈచిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. సాధారణంగా ఫస్ట్ లుక్ అంటే ఒకటో రెండో విడుదల చేసారు. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించే వర్మ ఏకంగా 20 ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు.

హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రిలతో పాటు ఫ్లోకామ్ ఇంచార్జ్ అరుణ్ ఇక్భాల్ ఖాన్ చౌదరి, స్టిల్ ఫోటో గ్రాఫర్ నవీన్ కళ్యాణ్, పోస్టర్స్ డిజైనర్ కాశి తదితరులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు, వివరాలు...

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ


ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...‘మూస పద్దతులకు భిన్నంగా రూపొందుతున్న ‘ఐస్ క్రీమ్-2' చిత్రం ఫస్ట్ లుక్ కూడా పాత పద్దతులకు విరుద్ధంగానే విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఒకే ఒక్క స్టిల్ ఎందుకు?

ఒకే ఒక్క స్టిల్ ఎందుకు?


ఫస్ట్ లుక్ అంటే ఒకే ఒక్క స్టిల్ ఎందుకు రిలీజ్ చేయాలి? అనే ఆలోచనతో ఒకేసారి 20 ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసామని తెలిపారు.

విడుదల తేదీ

విడుదల తేదీ


ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

ఐస్ క్రీమ్-3 కూడా...

ఐస్ క్రీమ్-3 కూడా...


ఐస్ క్రీమ్-2 విడుదలకు ఓ నాలుగు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 15న ‘ఐస్ క్రీమ్-3' చిత్రాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు.

ఇకపై నెలకో ఐస్ క్రీమ్

ఇకపై నెలకో ఐస్ క్రీమ్


‘ఐస్ క్రీమ్' సిరీస్ నుండి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని వర్మ తెలిపారు.

వర్మపై పొగడ్తలు

వర్మపై పొగడ్తలు


నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ...‘నిర్మాతగా ఎక్కడో నేల మీద ఉన్న నన్ను ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లారు రామ్ గోపాల్ వర్మ. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని పొగిడారు.

ఐస్ క్రీమ్-2

ఐస్ క్రీమ్-2


‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసాం. ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రదాన పాత్రలతో ఎంతో ఎక్స్‌ట్రార్డినరీగా తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదు' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X