For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Allu Arjun: ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో.. గంగోత్రికి ముందే మూడు.. చిరు, కమల్‌తోనూ!

  |

  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. అదే సమయంలో జయాపజయాలను బేరీజు వేయకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న 'పుష్ప' మూవీతో బాలీవుడ్‌లోకీ అడుగు పెడుతున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా అతడి జీవితంలోని బెస్ట్ మూమెంట్స్‌పై స్పెషల్ స్టోరీ మీకోసం!

  చిరు సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం

  చిరు సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విజేత' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు బుల్లి అల్లు అర్జున్. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన ‘స్వాతి ముత్యం' సినిమాలోనూ నటించాడు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ‘డాడీ'లో అత్యంత ముఖ్యమైన పాత్రను చేశాడు. వీటిలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుని సినిమా రంగంలో అడుగులు వేశాడు.

  గంగోత్రితో హీరో.. ఆర్యతో స్టైలిష్ స్టార్‌ పేరు

  గంగోత్రితో హీరో.. ఆర్యతో స్టైలిష్ స్టార్‌ పేరు

  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘గంగోత్రి'తో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. ఆ వెంటనే సుకుమార్ చేసిన ‘ఆర్య'తో స్టైలిష్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ ఎన్నో విజయాలను అందుకున్నాడు. తద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అంతేకాదు, అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగిపోయాడు.

  విజయాలతో పాటు భారీ డిజాస్టర్లు కూడా

  విజయాలతో పాటు భారీ డిజాస్టర్లు కూడా

  హీరోగా అల్లు అర్జున్ కెరీర్ విజయంతో ప్రారంభం అయింది. అలా వరుసగా హ్యాట్రిక్ నమోదు చేసిన అతడు.. ‘దేశముదురు'తో భారీ హిట్ కొట్టాడు. ‘జులాయి', ‘రేసుగుర్రం', ‘సన్నాఫ్ సత్యమూర్తి', ‘సరైనోడు', ‘అల.. వైకుంఠపురములో' వంటి సక్సెస్‌లు అందుకున్నాడు. అదే సమయంలో ‘వరుడు', ‘బద్రీనాథ్', ‘హ్యాపీ', ‘ఇద్దరమ్మాయిలతో', ‘నా పేరు సూర్య' వంటి డిజాస్టర్లూ వచ్చాయి.

  ప్రేమ వివాహం.. ఎప్పుడూ కుటుంబంతోనే

  ప్రేమ వివాహం.. ఎప్పుడూ కుటుంబంతోనే

  కెరీర్ పరంగా పుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే అల్లు అర్జున్.. స్నేహారెడ్డితో ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలోనే 2011లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక, ఈ జంటకు అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో బన్నీ ఎక్కువగా కుటుంబంతోనే సమయాన్ని గడుపుతాడు. ఇందులో భాగంగానే హాలీడే ట్రిప్‌లకు సైతం వెళ్తుంటాడు.

  బన్నీకే దక్కినవివే.. ఏకైక తెలుగు హీరోగా

  బన్నీకే దక్కినవివే.. ఏకైక తెలుగు హీరోగా

  సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోగా ఎన్నో అవార్డులను అందుకున్నాడు అల్లు అర్జున్. కేరళలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు. తన డబ్బింగ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులకు చేరువై యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్ అందుకుని రికార్డులకెక్కాడు. బాలీవుడ్ కంటే ముందే సిక్స్ ప్యాక్ చేసి ఔరా అనిపించాడు. మరీ ముఖ్యంగా తన డ్యాన్స్‌తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించాడు.

  పుష్పతో ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్

  పుష్పతో ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్

  ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. దీనితో బన్నీ ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు.

  Pushpa Movie ప్యాన్ ఇండియా స్థాయి తగ్గేదేలే | Introducing Pushpa Raj
  రాజకీయాలనూ టచ్ చేస్తూ.. ఆయనతో

  రాజకీయాలనూ టచ్ చేస్తూ.. ఆయనతో

  అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంతో బన్నీ తొలిసారి పాలిటిక్స్‌ను టచ్ చేయబోతున్నాడనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

  English summary
  Allu Arjun is an Indian film actor who primarily works in Telugu cinema. Known for his dancing abilities, he is a recipient five Filmfare Awards South and three Nandi Awards. After his debut in Gangotri, Allu appeared in Sukumar-directed Arya which earned him Nandi Special Jury Award.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X