Allu Arjun : అల్లు అర్హ యానిమల్​ ఐకానిక్ స్టెప్​.. భలే చేసింది ఫన్నీగా.. షాక్ అవుతున్న బన్నీ ఫ్యాన్స్​!

అల్లు ఫ్యామిలీ వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో అర్హకు సంబంధించిన ఫన్నీ అండ్ డ్యాన్స్​ వీడియోలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆమెకు చిన్నవయసులోనే నెట్టింట్లో మంచి క్రేజ్ కూడా ఉంది. అయితే తాజాగా ఈ బుడతది యానిమల్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్​కు సంబంధించిన ఐకానిక్ స్టెప్​ను వేసింది. అది ప్రస్తుతం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. దానికి సంబంధించిన వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

అర్హ వీడియోలకు మంచి రెస్పాన్స్...:ఐకానిక్ స్టార్‌ హీరో అల్లు అర్జున్​కు దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిన విషయమే. అలానే ఆయన కుమార్తె అర్హకు సోషల్‌మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. చాలా సార్లు కూతురితో కలిసి బన్ని చేసే హంగామాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. నెట్టింట్లో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్​తో ఎంతో మందిని ఆకట్టుకుంది అర్హ. ఇక తను చేసే హల్ చల్​తో నెటిజన్ల మనసును కూడా దోచుకుంటుంటుంది. అందుకే ఆమె వీడియోలకు మంచి రెస్పాన్స్​ వస్తూ ఉంటుంది. అర్హను తండ్రికి తగ్గ తనయ అంటూ కూడా నెటిజన్స్ తెగ ప్రశంసింస్తూ ఉంటారు.

Icon Star Allu Arjun Daughter Allu Arha Animal Movie Jamal Kudu Dance Video Viral

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా..:ఇప్పటికే అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. తన మొదటి సినిమాగా సమంత శాకుంతలంలో నటించింది. ఈ చిత్రంలో తన ముద్దు ముద్దు మాటలతో అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఎంతో మంది హృదయాలను దోచుకుని మరింత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత మళ్లీ ఏ చిత్రంలోనూ నటించలేదు.

10 నిమిషాలకు 20లక్షలు...:ఇక శాకుంతలంలో నటించిన తర్వాత ఎన్టీఆర్ దేవరలో అల్లు అర్హ నటించినట్లు ఆ మధ్య గట్టిగా ప్రచారం సాగింది. హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించనుందని అన్నారు. నిమిషానికి రూ.2 లక్షలు పారితోషికం చెప్పున తనకు ఇచ్చారనే టాక్ కూడా నడిచింది. మొత్తం సినిమా మీద అర్హ పాత్ర దాదాపు 10 నిమిషాల నిడివి ఉందని, ఆ లెక్కన రూ.20 లక్షలు పారితోషికం ఇచ్చారని వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి ఉండాల్సిందే.

జమల్ కుడు పాటకు అర్హ స్టెప్పులు:అయితే ఇప్పుడీ చిన్నారి తల్లి తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. రీసెంట్​గా విడుదలైన యానిమల్‌ చిత్రంలోని జమల్‌ కుడు సాంగ్​ యూత్​ను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో మందు గ్లాస్‌ తలపై పెట్టుకుని విలన్​గా నటించిన బాబీ దేవోల్‌ వేసే స్టెప్‌లు నెట్టింట మస్త్ ట్రెండ్‌ అయ్యాయి. ఇప్పుడు అదే సాంగ్​కు అర్హ కూడా అలాంటి స్టెప్పులే వేసి ఆకట్టుకుంది. అయితే, అర్హ చేసింది గ్లాస్‌తో కాదండోయ్‌. తలపై ప్లేట్‌ పెట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఫన్నీగా చేసింది. ఇదే ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతోంది. అందరూ దీన్ని చూసి తెగ నవ్వుకుంటున్నారు. అర్హను ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X