Pushpa 2: సుక్కు బన్నీల కష్టాలు మామూలుగా లేవుగా.. ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్ ఖాయం…

Pushpa 2: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం కోట్లాదిమంది అభిమానులు వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్ మూవీ సినిమా విడుదలకు ముందు ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా పుష్ప 2 కి సంబంధించిన ఓ వీడియోను హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందో మీరు కూడా ఓ లూక్కేయండి.

అల్లు అర్జున్ - సుకుమార్ క్రేజీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 1. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 . ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి యంగ్ బ్యూటీ శ్రీలీల ఐటెం సాంగ్ లో స్టెప్పులేస్తోంది. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందించారు. విడుదల ముందుకే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, టీజర్, ఐటమ్ సాంగ్స్ కు ఎనలేని ఆదరణ వస్తోంది. దీంతో ఈ సినిమాపై ఊహించని రీతిలో ఆదరణ పెరిగిపోయింది.

Icon star Allu Arjun has released Pushpa 2 The Rule Making video

పుష్ప 1 సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమా కోసం మూవీ యూనిట్ దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడిన విషయం తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీలో శాండిల్ వుడ్ స్మగ్లింగ్ బేస్డ్ గా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రధానంగా యాక్షన్ సీక్వెల్స్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇండియా లెవెల్ యాక్టర్స్, టెక్నీషియన్స్ పని చేశారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్ లలో విడుదల కాబోతుంది.

ఇందులో ఇండియాలోనే 6,500, ఓవర్సీస్ లో 500 స్క్రీన్స్ లలో విడుదల కాబోతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న సినిమాగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేసింది. ఈ భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఇతర ఫ్యాన్ ఇండియా సినిమాల రికార్డులను బద్దలు కొట్టేసింది పుష్ప 2. అలాగే.. తొలి రోజు ఏకంగా రూ. ఏకంగా 300 కోట్ల వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ .. మేకర్స్ పుష్ప 2:ది రూల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రధానంగా యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానాన్ని చూపించారు. ఆ సమయంలో డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఇలా కష్టపడ్డారో చూడవచ్చు. అలాగే భారీ సెట్టింగ్స్, అధిక సంఖ్య యాక్టర్లు చూస్తే.. సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. అలాగే.. ఒక్కొ విజువల్ ను మైండ్ బ్లోయింగ్గా కావాల్సిందే. ఇదెలా ఉండే.. సెన్సార్ బోర్డ్ పుష్ప2 సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే.. పుష్ప 2 రన్ టైమ్ 3:20 గంటలు ఉండబోతుంది. ఈ సినిమాలో గంగమ్మ జాతర హైలెట్ అని చెబుతున్నారు. అందుకు సంబంధించిన సీన్స్ చేస్తే.. గుస్ బాంప్స్ ఖాయం. ఈ వీడియోతో పుష్ప 2 సినిమాపై మరింత హైప్స్ పెరుగుతాయని చెప్పవచ్చు.

More from Filmibeat

Read more about: sukumar pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X