RRR మూవీపై అల్లు అర్జున్ రివ్యూ: బావ, బ్రదర్ గురించి స్పెషల్‌గా.. సినిమాపై ఊహించని విధంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి తెరకెక్కినా.. యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూసిన సినిమా RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ చిత్రాన్ని దేశమే మెచ్చిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందించడమే. అంతేకాదు, ఇందులో టాలీవుడ్‌నే ఏలుతోన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం కూడా. అందుకే ఆరంభంలోనే ఈ మూవీ అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. దీంతో ఎంతో గ్రాండ్‌గా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి భారీ స్థాయిలో స్పందన కూడా దక్కుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

వాళ్లిద్దరితో జక్కన్న మల్టీస్టారర్
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన భారీ చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు పోషించారు. ఇది మార్చి 25వ తేదీనే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

అంతా పాజిటివ్.. ట్రెండింగ్‌లో
ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏరియాల నుంచి దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో కళకళలాడిపోయాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. దీంతో ఈ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతూనే ఉంది.

కలెక్షన్ల వర్షం... రికార్డులు బ్రేక్
భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని.. బిగ్ బిజినెస్‌తో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ శుక్రవారమే గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 కోట్లు పైగానే షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా మొదటి రోజే రూ. 100 కోట్ల మార్కును చేరుకుందని తెలుస్తోంది.

సెలెబ్రిటీల నుంచీ స్పందన
ప్రతిష్టాత్మక చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం) కోసం చాలా కాలంగా మెగా, నందమూరి హీరోల అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇక, వాళ్ల నిరీక్షణను నిన్నటితో తెరపడింది. దీంతో అందరూ థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాను చూస్తున్నారు. అంతేకాదు, ట్విట్టర్ వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు.

సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై సెలెబ్రిటీల స్పందన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సినిమాను చూసిన తర్వాత దీనిపై ట్వీట్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన సినిమా. రాజమౌళి గారు మీ అత్యున్నత పనితనం మమ్మల్ని గర్వంగా నిలబడేలా చేసింది' అని చెప్పుకొచ్చాడు.

హీరోలిద్దరిపై ప్రశంసల వర్షం
RRR (రౌద్రం రణం రుధిరం) లో కలిసి నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై బన్నీ ప్రశంసలు కురిపించాడు. ‘కెరీర్‌లోనే అత్యుత్తమ నటన కనబరిచిన మెగా పవర్ అయిన నా సోదరుడు రామ్ చరణ్ పట్ల గర్వంగా ఉంది. అలాగే, నా బావ పవర్ హౌస్ ఎన్టీఆర్‌కు రెస్పెక్ట్ అండ్ లవ్. నీ అసాధారణమైన నటనకు ఫిదా అయ్యాను' అంటూ ఇద్దరి గురించి వెల్లడించాడు ఐకాన్ స్టార్.
Recommended Video


మనకు గర్వకారణం అంటూ
ఇక, RRR (రౌద్రం రణం రుధిరం) కోసం పని చేసిన వాళ్లను ప్రస్తావిస్తూ.. ‘అజయ్ దేవగణ్ సార్.. స్వీటెస్ట్ ఆలియా స్క్రీన్ మీద కనబడిన తీరు బాగుంది. అలాగే, కీరవాణి గారికి, సెంథిల్ కుమార్ గారికి, డీవీవీ దానయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇండియన్ సినిమాను గర్వంగా నిలబెట్టిన మీ అందరికీ థ్యాంక్స్. ఇది కిల్లర్ మూవీ' అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











