Allu Arjun: పవన్ కల్యాణ్‌పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్.. అతడికే తన సపోర్ట్ అంటూ!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఓవైపు వైసీపీ, మరోవైపు తెలుగుదేశం - జనసేన పార్టీ - భారతీయ జనతా పార్టీ కూటమిలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. తమనే గెలిపించమంటే తమనే గెలిపించమని ఓటరు మహాశయులను కోరుతున్నారు. ఈక్రమంలోనే పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన వాళ్లకు సపోర్ట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియా వేదికగా కూడా తమకు ఇష్టమైన నాయకులకు మద్దతు ఇస్తున్నారు.

అయితే ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్న మీరు అందులో గెలవాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. మీ సినీ కుటుంబ సభ్యుడిగా అంటూ పవన్ కల్యాణ్ తో తనకు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్ పై అదిరిపోయే ట్వీట్ చేశారు. మెగా కుటుంబ సభ్యుడిని అయిన తాను.. ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తున్నారో చెప్పి షాక్ ఇచ్చారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Icon Star Allu Arjun Supports Pawan Kalyan about to face the big battle of politics

మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మరో నాలుగు రోజుల్లోనే పోలింగ్ జరగబోతుండగా.. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ తమ ప్రచారాలను వేగవంతం చేశాయి. ముఖ్యంగా మరో రెండు రోజుల్లోనే ఈ ప్రచారం ఆగిపోనుండగా.. ఆలోపే ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నాయి. పెద్ద పెద్ద నాయకులు సైతం ఏపీలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనాని.. పవన్ కల్యాణ్ కు సపోర్టింగ్ గా అనేక మంది సినీ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు.

ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం శాసనసభ నుంచి పోటీ చేస్తుండగా.. అక్కడ మరింత వేడి రాజుకుంది. అనేక మంది సెలబ్రిటీలు అక్కడే ప్రచారం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది రోజూ కనిపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఇలా పవన్ కల్యాణ్ పై తమకు ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ క మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ.. తన సపోర్ట్ ఆయనకేనంటూ వివరించారు.

OTTలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్.. అనుక్షణం ఉత్కంఠ రేపే దీన్ని ఎక్కడ చూడాలంటే?

ముందుగా ఎన్నికల ప్రయాణంలో పవన్ కల్యాణ్ ఎదుర్కోబోతున్న యుద్ధానికి గాను తన తరఫును హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పాడు అల్లు అర్జున్. అలాగే పవన్ కల్యాణ్ తన జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ ఆయన ఎంచుకున్న మార్గం గురించి తాను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే కుటుంబ సభ్యుడిగా, తన సపోర్ట్, ప్రేమ ఎప్పుడూ పవన్ కల్యాణ్ కు ఉంటుందని వివరించాడు. మీరు కోరుకున్నవి అన్నీ జరగాలని ఆశిస్తున్నానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X