ఎట్టకేలకు సుమంత్ ‘ఇదం జగత్’ రిలీజ్ డేట్ లాక్
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటిస్తున్న 'ఇదం జగత్' చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ చివరి వారంలోనే ఈ మూవీ విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. తాజాగా డిసెంబర్ 14న విడుదల చేయడానికి డేట్ లాక్ చేశారు.
అంజు కురియన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనీల్ శ్రీ కంఠం దర్శకత్వం వహిస్తున్నారు. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సుమంత్ తన కెరీర్లో తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. సుమంత్ పాత్ర, కథకు 'ఇదం జగత్' అనే టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. . పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనం ప్రేక్షకులను అబ్బుర పరిచేలా ఉంటుందట.
శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్


Click it and Unblock the Notifications











