»   » ‘ఇద్దరబ్బాయిలతో’ అంటూ మరో సినిమా

‘ఇద్దరబ్బాయిలతో’ అంటూ మరో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరోయిన్లుగా 'ఇద్దరమ్మాయిలతో' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో 'ఇద్దరబ్బాయిలతో' సినిమా కూడా రాబోతోంది. ఆ సినిమా విడుదలైన రోజు ఈ సినిమా ప్రారంభం కావడం గమనార్హం.

శ్రీ చంద్రవౌళి క్రియేషన్స్ పతాకంపై రాజ్‌కుమార్ దర్శకత్వంలో తాళ్లూరి లక్ష్మణ్, బాల శ్రీవాత్సవ్ 'ఇద్దరబ్బాయిలతో' చిత్నాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్‌బాబు కథానాయకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

Iddarabbayilatho

ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇవ్వగా నిర్మాత కె.అశోక్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. జయ బి. తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ యూత్‌ను ఆకట్టుకునే అంశంతో ఈ చిత్రాన్ని ప్రేమ, స్నేహం, కెరీర్ అనే మూడు అంశాల ప్రధాన్యతతో నిర్మిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో సంగీత దర్శకుడు జె.వి.ప్రసాద్, జె.కె.్భరవి, నారా జయశ్రీదేవి, దర్శకుడు బాబ్జి, నాగులపల్లి పద్మిని, కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవ, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, నిర్మాతలు: తాళ్లూరి లక్ష్మణ్, బాల శ్రీవాత్సవ్, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్.

English summary
Iddarabbayilatho movie launched yester day at Annapurna studios. Uday Babu introduce as a hero. Rajkumar directs this movie, produced by Lakshman and Srivastav.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu