బన్నీ 'ఇద్దరు అమ్మాయిలతో....' (లీకడ్ ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: అల్లు అర్జున్ తన తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పై ఫ్యాన్స్ చాలా అంచనాలు ఉన్నాయి. దేశముదురు తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ కావటం, జులాయి చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావటం ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

ఇక 'జులాయి' సినిమాతో తన జోష్‌ చూపించారు అల్లు అర్జున్‌. ఆకతాయి కుర్రాడిగా బన్నీ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు ప్రేమికుడి అవతారం ఎత్తుతున్నారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమలోకి దింపేస్తున్నారు. ఆ సినిమానే 'ఇద్దరమ్మాయిలతో'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లుఅర్జున్‌తో అమలాపాల్‌, కేథరిన్‌ ఆడిపాడనున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.

బ్యాంకాక్‌లో కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కిస్తున్నారు. సింహభాగం విదేశాల్లోనే షూటింగ్‌ జరగనుంది. చాలాకాలం తరవాత పూరి తెరకెక్కిస్తున్న ప్రేమకథ ఇది. వినోదం, యాక్షన్‌ సన్నివేశాలకూ చోటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాటను సిద్ధం చేశారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ. చిత్రంలో లీకైన అల్లు అర్జున్ ఫోటో ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X