‘ఇద్దరమ్మాయిలతో’ ఓవర్సీస్ రిలీజ్ రిపోర్ట్
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో'. ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న చిత్రాన్ని ఓవర్సీస్‌లో 'బ్లూ స్కై సినిమాస్' సంస్థ రిలీజ్ చేస్తోంది. విదేశాల్లో ఒకరోజు ముందుగా మే 30 ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం హక్కుల కోసం ఈ సంస్థ రూ. 3 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
ఓవర్సీస్‌లో ఈ చిత్రాన్ని మొత్తం 175 పైగా స్క్రీన్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఇన్ని స్క్రీన్లలో విడుదల కావడం అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ రిలీజ్‌గా ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఉత్తర అమెరికా ఖండంలో ఈచిత్రాన్ని అత్యంత నాణ్యత గల 4కె డిజిటల్ స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా డిజిటల్ స్క్రీన్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్సును మెప్పించేలా ఉంటుందట. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ విదేశాల్లో స్థిరపడ్డ రాక్ స్టార్‌గా నటిస్తున్నారు. మామూలుగానే బన్నీ అన్నా, బన్నీ నృత్యాలన్నా మహా క్రేజ్. ఇక రాక్ స్టార్‌గా ఇందులో బన్నీ వేసే స్టెప్పులు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా యాక్షన్ సన్నివేశాల్లో కూడా అల్లు అర్జున్ ఇరగదీసాడని యూనిట్ సభ్యులు చెబుతున్న మాట.


Click it and Unblock the Notifications











