‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో రిలీజ్ ఏప్రిల్ 28న!
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 28 ఆడియో వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే వేదిక ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు. వైజాగ్‌లో ఆడియో వేడుక జరుపుతారనే వార్తలు వినిపించినప్పటికీ శిల్పకళా వేదికలోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మే నెలాఖరుకు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇటీవల ఈచిత్రం ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంతకు ముందు 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీని సరికొత్తగా చూపించబోతున్నారు.
బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల స్థలంలో జరుగుతోంది. ఇక్కడ బ్యాలెన్స్ సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











