For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 21 ఆడియో వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే రెండో వారంలో సినిమాను విడుదల చేయనున్నారు.

    అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇటీవల ఈచిత్రం ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంతకు ముందు 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీని సరికొత్తగా చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో బన్నీ చేసే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవల్లో ఉండనున్నాయి.

    బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

    ఇందులో థాయ్ ఫైట్ మాస్టర్ కేచ కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసాడట కెచె. ఇందుకుగాను అతనికి నిర్మాత బండ్ల గణేష్ భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చాడని టాక్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Allu Arjun’s undershoot film Iddarammayilatho will have its audio launched on a grand scale in April 21 while the film is slated for a release on May 10. Devi Sri Prasad is the music composer. The major shoot of the film was canned in Spain, Bangkok and the final schedule is to be filmed shortly in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X