రాక్‌స్టార్‌గా బన్నీ, ‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో రేపే..
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియో రేపు(ఏప్రిల్ 28) హైదరాబాద్ లోని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అభిమానులకు పాసులు కూడా జారీ అయ్యాయి.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. చివరగా విడుదలైన జులాయి కూడా సాంగ్స్ కేక అనే టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియోపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ విదేశాల్లో స్థిరపడ్డ రాక్ స్టార్‌గా నటిస్తున్నారు. మామూలుగానే బన్నీ అన్నా, బన్నీ నృత్యాలన్నా మహా క్రేజ్. ఇక రాక్ స్టార్‌గా ఇందులో బన్నీ వేసే స్టెప్పులు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
సినిమా గురించి నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'బన్నీలోని కొత్త యాంగిల్ ఈ సినిమాలో చూస్తారు. పూరీ కెరీర్లో కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా నేపథ్యమే కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. 'టాప్ లేచిపోద్ది..' అనే పల్లవితో సాగే ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుది. ఈ నెల 28న ఆడియో విడుదల చేసి మే 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.


Click it and Unblock the Notifications











