For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో..’ బ్యాంకాక్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ అక్కడికి బయల్దేరి వెళ్లింది. ఈ నెల 19 నుంచి బ్యాంకాక్‌లో షూటింగ్ మొదలు కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమలపాల్, కేథరిన్ హీరోయిన్లు.

    ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగనుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరో కావడం, దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో నిర్మాత గణేష్ ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదట.

    దర్శకుడు పూరి జగన్నాథ్ ఇకపై తన సినిమాల్లో రీల్ వాడకుండా డిజిటల్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించారు. తన తాజా సినిమా 'ఇద్దరమ్మాయిలతో' నుండే ఈ ట్రెండ్ మొదలు పెట్టారు. ఇందుకోసం అత్యాధునికమైన 'ఆర్రి అలెక్నా కెమెరా సిస్టమ్స్' కొనుగోలు చేసారు. ఈ కెమెరాల ద్వారా హై క్వాలిటీ ఔట్ పుట్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని 'లైఫ్ ఆఫ్ పై', స్కైఫాల్, అవెంజర్స్ లాంటి చిత్రాల్లో వాడారు. తెలుగులో తొలిసారిగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి వాడుతున్నారు.

    ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది. ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో హీరో పడే పాట్లు... అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

    English summary
    
 Allu Arjun’s movie Iddarammailatho is going to be shot in Bangkok. The shooting will start on 19 December. Puri Jagan is the director. Ganesh Bandla producing this film. ‘Iddarammayilatho’ will be the first movie to see these changes and Jagan has picked two Arri Alexa Cameras for the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X