బన్నీ 'ఇద్దరమ్మాయిలతో' రిలీజ్ వాయిదా?
హైదరాబాద్ : దేశముదురు తర్వాత బన్నీ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. .లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ముందనుకున్న తేదీ కాకుండా వాయిదా పడనుంది అని సమాచారం. మే 23 కానీ,మే 24 న కానీ విడుదల చేస్తామన్నారు. కానీ అదే సమయంలో ఐపిఎల్ సీజన్ చివరకు వస్తుంది. దాంతో ఈ చిత్రాన్ని మే 31 కి వాయిదా వేసే అవకాసం ఉందని తెలుస్తోంది.
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..అల్లరి... ఆలోచన - ఆ అబ్బాయి ప్రత్యేకతలు. దుమ్ము రేపే జోరుంది. నిజం మాట్లాడతాడు. నిక్కచ్చిగా ఉంటాడు. అతని ఫిలాసఫీ కూడా కొత్తగా ఉంటుంది. 'చుట్టూ ఎవరూ లేనప్పుడు నువ్వేంటో.. అదే నువ్వు..' అంటూ హితోపదేశం చేస్తాడు. అతను ఇద్దరమ్మాయిలతో సాగించిన ప్రయాణం ఎలాంటిదో మా సినిమా చూసి తెలుసుకోవల్సిందే అంటున్నారు పూరి జగన్నాథ్.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత పూరి ఓ ప్రేమకథ తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రేమాయణాన్ని చూపించే విధానం అందర్నీ అలరిస్తుంది. అల్లు అర్జున్ నటన, ఆయన కాస్ట్యూమ్స్ కొత్తగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. నెట్‌లో లక్షల మంది చూశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు యువతరాన్ని ఆకట్టుకొంటాయి''అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.
స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











