బన్సీ స్టైల్ అదిరే.. (ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ పోస్టర్స్)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, మరోసారి తన తాజా సినిమా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో స్టైలిష్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోనున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం ఫస్ట్ లుక్ వాల్ పోస్టర్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ఈ చిత్రంలో బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. శర వేగంగా సాగుతున్న ఈచిత్రం ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. మే 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో వీక్షించవచ్చు.

బన్సీ స్టైల్ అదిరే.. (ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ పోస్టర్స్)

ఇద్దరమ్మాయిలతో చిత్రంలో స్టైలిష్ లుక్ తో అల్లు అర్జున్.

బన్సీ స్టైల్ అదిరే.. (ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ పోస్టర్స్)

ఈ సినిమాలో బన్నీ యాక్షన్ సీన్లు అదరగొట్టాడు అనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

బన్సీ స్టైల్ అదిరే.. (ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ పోస్టర్స్)

థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.

బన్సీ స్టైల్ అదిరే.. (ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ పోస్టర్స్)

ఒంటిపై టాటూలతో అల్లు అర్జున్....

బన్సీ స్టైల్ అదిరే.. (ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ లుక్ పోస్టర్స్)

బన్నీ-పూరి కాంబినేషన్లో గతంలో వచ్చిన దేశ ముదురు హిట్టయింది. ఈనేపథ్యంలో ఇద్దరమ్మాయిలతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్. 'ఇడియట్‌', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అదే విధంగా ఈచిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.

అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X