‘ఇద్దరమ్మాయిలతో’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రంలో కొన్ని సీన్లకు కత్తెర పెట్టిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది.
మే 31న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలవుతోంది. వాస్తవానికి ఈ రోజే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా...ఐపీఎల్ ఫీవర్ కారణంగా సినిమాను వచ్చే వారానికి వాయిదా వేసారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకు ముందు బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. చివరగా విడుదలైన జులాయి కూడా సాంగ్స్ కేక అనే టాక్ తెచ్చుకున్నాయి.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ విదేశాల్లో స్థిరపడ్డ రాక్ స్టార్‌గా నటిస్తున్నారు. మామూలుగానే బన్నీ అన్నా, బన్నీ నృత్యాలన్నా మహా క్రేజ్. ఇక రాక్ స్టార్‌గా ఇందులో బన్నీ వేసే స్టెప్పులు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా యాక్షన్ సన్నివేశాల్లో కూడా అల్లు అర్జున్ ఇరగదీసాడని యూనిట్ సభ్యులు చెబుతున్న మాట.
సినిమా గురించి నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'బన్నీలోని కొత్త యాంగిల్ ఈ సినిమాలో చూస్తారు. పూరీ కెరీర్లో కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా నేపథ్యమే కొత్తగా ఉంటుందని తెలిపారు. దర్శకుడు పూరి మాట్లాడుతూ 'బన్నీ డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ బాగా చేస్తాడని మాత్రమే తెలసు...ఈ సినిమాలో తనలోని మరిన్ని క్వాలిటీలు చూస్తారు' అన్నారు.


Click it and Unblock the Notifications











