‘ఇద్దరమ్మాయిలతో...’ న్యూ ఫోటోస్ వెరీ హాట్
హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఈ చిత్రంపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, గెటప్స్ దగ్గరనుంచి విభిన్నత చూపించాడనే వార్త అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.
ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ పొందింది. ఈ నెల 31న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే.... ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్.
'ఇడియట్', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.

ఈచిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు యూనిట్ సభ్యులు

థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.

బన్నీ కెరీర్లోనే నెం.1 చిత్రం అవుతుంది. ఈ చిత్రం తీస్తున్న పూరి అన్నయ్యకు థాంక్స్' అంటూ బండ్ల గణేష్ ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాడు

సినిమా ప్రచారం చిత్రాలు, ట్రైలర్లు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది.

స్పెయిన్ దేశంలో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు

అల్లు అర్జున్ తొలిసారిగా ఈచిత్రంలో శరీరంపై టాటూలు వేసుకుని కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో...అల్లు అర్జున్ పాత్ర డిఫెరెంట్ గా సాగుతుంది. ఒకేసారి ఇద్దరికి లైన్ వేస్తూంటారు. ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడదు. అయినా ఒకరికి తెలీయకుండా మరొకరికి గాలం వేశాడు. టైమ్ టేబుల్ ప్రకారం ఇద్దరి దగ్గరా ప్రేమ పాఠాలు వల్లింస్తుంటాడు ఈ అల్లరి ప్రేమికుడు. అయితే అందుకు ఓ కారణం ఉంది. అదేమిటి? ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమలోకి ఎందుకు దించాల్సి వచ్చింది? ఈ విషయాలు తెలియాలంటే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూడాల్సిందే అంటున్నారు.

బన్నీ, అమలా పాల్, కేథరీన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు యూనిట్ సభ్యులు

దేశముదురు తర్వాత అల్రు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ రిపీట్ కావటం, జులాయి చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావటం ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

ఈ చిత్రం మలయాళంలో రోమియో జూలియట్స్ పేరుతో విడుదల కానుంది.

ఇద్దరమ్మాయిలతో మూవీ న్యూ స్టిల్స్

ఇద్దరమ్మాయిలతో మూవీ న్యూ స్టిల్స్


Click it and Unblock the Notifications











