బన్నీ ‘ఇద్దరమ్మాయిలతో’ తాజా అప్డేట్స్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈచిత్రం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ 30 రోజుల్లో థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ నెల రోజుల పాటు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ తో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు.
షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ సభ్యులంతా హైదరాబాద్ బయల్దేరారు. ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ స్పెయిన్లో ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడకుండా బన్నీ ఇమేజ్ కు తగిన విధంగా స్టైలిష్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీనీ లవర్ బాయ్‌లా చూపెట్టబోతున్నాడు దర్శకుడు పూరి.
'ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం అల్లు అర్జున్ కండలు బాగానే పెంచాడు. ఈ సినిమాలో మరి 'ఇద్దరమ్మాయిలతో' ప్రేమలో పడాలి కాబట్టి, వాళ్లని ఆకర్షిచాలంటే, మరి కండలు తిరిగిన బాడీ వుండాలి కదా ! అందుకే, అందుకు తగ్గట్టుగానే ఇందులో కొత్తగా కనిపించనున్నాడు.
ఇందులో అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications











