For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇద్దరమ్మాయిలతో’ ట్రైలర్ వీక్షించండి (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న రెండో చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈచిత్రం ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

    ఇంతకు ముందు 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీని సరికొత్తగా చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో బన్నీ చేసే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవల్లో ఉండనున్నాయి.

    ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఈ చిత్రంలో బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. మే రెండో వారంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Iddarammayilatho official first look promo released. The movie directed by Puri Jagannath starring Allu Arjun, Amala Paul and Catherine Tresa in the lead roles. Bandla Ganesh is producing this film under the banner Parameswara Arts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X