అమ్మాయిల పట్ల.... అల్లు అర్జున్-పూరి వివక్ష!?
హైదరాబాద్: పురుషాధిక్య ప్రపంచంలో ఆడవారిపై అణచివేత ధోరణి ఎప్పటి నుండో కొనసాగుతూనే ఉందనేది కాదనలేని వాస్తవం. మహిళలకు తగిన అవకాశాలు అనే నినాదం కేవలం నినాదాలకే తప్ప ఆచరణలో కాదనేది అనేక సందర్భాల్లో స్పష్టమైంది కూడా. ఇక సినిమా పరిశ్రమ సంగతి సరేసరి. ఇక్కడ అంతా హీరోల ఆధిపత్యమే.
తాజాగా అల్లు అర్జున్-పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం విషయంలో కూడా ఇలాంటి వివక్ష చూపారనే విషయం తేటతెల్లమైంది. ఇటీవల శివరాత్రిని పురస్కరించుకుని 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.
సినిమా పేరులో ఇద్దరమ్మాయిలు అని ఉన్పప్పటికీ.... ఆ పోస్టర్లలో మాత్రం ఒక్క అమ్మాయి ఫోటో కూడా చూపించలేదు. అన్నింటిలోనూ హీరో అల్లు అర్జున్ రకరకాల స్టైల్స్ ప్రదర్శించాడే తప్ప, హీరోయిన్లను ఒక్క పోస్టర్లోకూడా పోకస్ చేయలేదు. ఇది అమ్మాయిలపై వివక్షే అని కొందరు అంటున్నారు.
అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రానికి దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications











