‘ఇద్దరమ్మాయిలతో’ విడుదల వాయిదా
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఈచిత్రాన్ని మే చివరి వారానికి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయనున్నట్లు దర్శకుడు పూరి జగన్నాథ్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించారు.
మరో వైపు ఈ నెల చివరి వారంలో ఆడియో వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇంతకు ముందు 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీని మరో విభిన్నమైన కోణంలో చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో బన్నీ చేసే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవల్లో ఉండనున్నాయి. బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు.
ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో థాయ్ ఫైట్ మాస్టర్ కేచ కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసాడట కెచె. ఇందుకుగాను అతనికి నిర్మాత బండ్ల గణేష్ భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చాడని టాక్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











