ముందుగానే రిలీజ్ కాబోతున్న ‘ఇద్దరమ్మాయిలతో’
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ముందుగా నిర్ణయించిన డేట్ కంటే ఒక రోజు ముందే విడుదల కాబోతోంది. గతంలో చిత్రాన్ని మే 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని మే 23నే ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించినట్లు నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకు ముందు బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. చివరగా విడుదలైన జులాయి కూడా సాంగ్స్ కేక అనే టాక్ తెచ్చుకున్నాయి.
ఇందులో అల్లు అర్జున్ విదేశాల్లో స్థిరపడ్డ రాక్ స్టార్‌గా నటిస్తున్నారు. మామూలుగానే బన్నీ అన్నా, బన్నీ నృత్యాలన్నా మహా క్రేజ్. ఇక రాక్ స్టార్‌గా ఇందులో బన్నీ వేసే స్టెప్పులు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా యాక్షన్ సన్నివేశాల్లో కూడా అల్లు అర్జున్ ఇరగదీసాడని యూనిట్ సభ్యులు చెబుతున్న మాట.
సినిమా గురించి నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'బన్నీలోని కొత్త యాంగిల్ ఈ సినిమాలో చూస్తారు. పూరీ కెరీర్లో కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా నేపథ్యమే కొత్తగా ఉంటుందని తెలిపారు. దర్శకుడు పూరి మాట్లాడుతూ 'బన్నీ డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ బాగా చేస్తాడని మాత్రమే తెలసు...ఈ సినిమాలో తనలోని మరిన్ని క్వాలిటీలు చూస్తారు' అన్నారు.


Click it and Unblock the Notifications











