‘ఇద్దరమ్మాయిలతో’ టీం వాలెంటైన్స్ డే పార్టీ (ఫోటోలు)
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది. ఇక్కడ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు.
అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల వాలెంటైన్స్ డే పార్టీని హీరో అల్లు అర్జున్, దర్శకుడు పూరి చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఆ పార్టీలో అమలాపాల్, కేథరీన్ లు కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.

ఇద్దరమ్మాయిలతో టీం వాలెంటైన్స్ డే పార్టీ. పార్టీలో పాల్గొన్న అల్లు అర్జున్, పూరి జగన్నాథ్, అమలపాల్, కేథరీన్, ఇతర యూనిట్ సభ్యులు.

ఇద్దరమ్మాయిలతో చిత్రం వర్కింగ్ స్టిల్స్.

ఇద్దరమ్మాయిలతో చిత్రం వర్కింగ్ స్టిల్స్.

ఇద్దరమ్మాయిలతో చిత్రం వర్కింగ్ స్టిల్స్.

ఇద్దరమ్మాయిలతో చిత్రం వర్కింగ్ స్టిల్స్.


Click it and Unblock the Notifications











