నిజంగానే టాప్ లేపిన అల్లు అర్జున్, కేథరిన్( ఫోటోలు)
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ లో శివ బాబు బండ్ల సమర్పణ లో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున భారీ చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. దేశముదురు తర్వాత అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మరో భారి చిత్రం ఇది. అమలాపాల్, కేథరిన్ కథానాయికలు.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలో బన్నీ, కేథరిన్ మధ్య 'టాప్ లేచిపోద్ది' అనే సాంగును ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో చిత్రీకరించారు. తాజాగా అందుకు సంబంధించిన చిత్రాలు విడుదలయ్యాయి. ఆ ఫోటోలు చూస్తే.....సినిమాలో ఆ సాంగు టాప్ లేచిపోయే రేంజిలో ఉంటుందని స్పష్టం అవుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
ఈ పాటతో 'ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం మే 23న విడుదలకు సిద్దం అవుతోంది. బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి.

టాప్ లేచిపోద్ది సాంగులో కేకపుట్టించే ఫోజులో బన్నీ, కేథరిన్

అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఖర్చుతో సాంగు చిత్రీకరించారు

ఈ సాంగులో అల్లు అర్జున్, కేథరిన్ మాస్ లుక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

వావ్...వాటే సీన్

ఈ సినిమాతో కేథరిన్ బిజీన్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆమె అందం అలాంటిది మరి.

పాట చిత్రీకరణలో బన్నీతో విదేశీ డాన్సర్లు


Click it and Unblock the Notifications











