twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇద్దరమ్మాయిలతో’ ట్రైలర్ సౌతిండియా రికార్డ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8న ఈచిత్రం ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో ఈ ట్రైలర్ 1 మిలియన్ హిట్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

    మరో వైపు తొలి 5 రోజుల్లో అత్యధికంగా హిట్స్ సొంతం చేసుకున్న ట్రైలర్‌గా ఆల్ టైమ్ సౌతిండియా రికార్డు నెలకొల్పింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు..... ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజిలో ఉందో. ఏప్రిల్ 21 ఆడియో వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 10న సినిమాను విడుదల చేయనున్నారు.

    ఈ చిత్రంలో బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

    ఇంతకు ముందు 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీని సరికొత్తగా చూపించబోతున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Allu Arjun’s undershoot film Iddarammayilatho trailer has smashed all time south india record for most views in just 5 days and 1 million views in a week. Iddarammayilatho will have its audio launched on a grand scale in April 21 while the film is slated for a release on May 10. Devi Sri Prasad is the music composer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X