అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ ముహూర్తం ఖరారు
హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి ముహూర్థం ఖరారైంది. అక్టోబర్ 17న ఈచిత్రం పూజా కార్యక్రమం నిర్వహించి అక్టోబర్ 25నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవలే 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంగతిని పూరి జగన్నాథ్ తెలియజేస్తూ 'ఈ కథ విని బన్నీ ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు. ఇద్దరమ్మాయిలతో బన్నీ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మా కాంబినేషన్‌లో మరో విభిన్న చిత్రంగా ఇది రూపొందనుంది' అని చెప్పారు.
ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈచిత్రంలో ఒక హీరోయిన్ గా అమల పాల్ ఎంపికైంది. తనకు అవకాశం ఇవ్వడంపై అమలపాల్ ఆనందం వ్యక్తం చేస్తూ....డాన్సింగ్ స్టార్ బన్నీ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నేను హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉంది. ఆ సినిమాపై ఎంతో ఎగ్జైటెడ్‍గా ఉన్నాను' అంటూ అమల పాల్ ట్వీట్ చేసింది.
బండ్ల గణేష్ మాట్లాడుతూ 'బన్నీ,పూరి జగన్ కాంబినేషన్‌లో మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ కోసం జగన్నాథ్ అద్భుతమెన కథ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు' అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని దర్శకుడు పూరి జగన్నాథ్ సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











