బన్నీ ‘ఇద్దరమ్మాయిలతో’ ప్రారంభం

By Bojja Kumar

హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఈ రోజు(అక్టోబర్ 17) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. అమలపాల్, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్లు. ఇటీవలే 'గబ్బర్‌సింగ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత బండ్ల గణేష్‌ ఈ చిత్రానికి నిర్మాత. తొలి సన్నివేశానికి బాలాజీరావ్ క్లాప్ ఇవ్వగా, బండ్ల గణేష్ తండ్రి నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేసారు. శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ...బన్నీ అంటే ఎనర్జీ, చాలా కష్ట పడే వ్యక్తి. అతని డెడికేషన్ అంటే నాకెంతో ఇష్టం. ఇద్దరమ్మాయిలతో బన్నీ చేస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌, లవ్ స్టోరీ ఇది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ శాతం షూటింగ్ ఉంటుంది. నవంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టి, డిసెంబర్ నెలలో పూర్తి చేస్తాం. విడుదల ఎప్పుడు అవుతుందనేది నిర్మాత మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...కథ నాకు బాగా నచ్చింది. గణేష్ ఎప్పటి నుంచో సినిమా చేద్దామని అడుగుతున్నాడు. ఇప్పటికి కుదిరింది. ఈచిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని, పూరితో కలిసి మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందన్నారు.

తనకు అవకాశం ఇవ్వడంపై అమలపాల్ ఆనందం వ్యక్తం చేస్తూ....డాన్సింగ్ స్టార్ బన్నీ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నేను హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉంది. ఆ సినిమాపై ఎంతో ఎగ్జైటెడ్‍‌గా ఉన్నాను' అని తెలిపింది.

బండ్ల గణేష్‌ మాట్లాడుతూ 'బన్నీ,పూరి జగన్‌ కాంబినేషన్‌లో మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్‌ కోసం జగన్నాథ్‌ అద్భుతమెన కథ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు' అని తెలిపారు. ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె. నాయుడు, ఆర్ట్ : చిన్నా, ఎడిటింగ్ : ఎస్ఆర్ శేఖర్, డాన్స్ : దినేష్, నిర్మాత : బండ్ల గణేష్, కథ, స్క్రీన్ ప్లు, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X