నా కల ఈవారం నిజం కాబోతోంది: ఆనందంలో యాంకర్ రవి
Recommended Video

బుల్లితెరపై ఫేమస్ అయిన యాంకర్ రవి త్వరలో 'ఇది మా ప్రేమ కథ' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో మేఘనా లోకేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో మత్స క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తగినన్ని థియేటర్లు దొరకని కారణంగా ఇంతకాలం విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న ఈచిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. డిసెంబర్ 8న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని యాంకర్ రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

నా కల నిజం కాబోతోంది
హేయ్ ఫ్రెండ్స్. అందరూ ఈ శుక్రవారం సిద్ధంగా ఉన్నారా? ఈనెల 8న నా డ్రీమ్ నిజం కాబోతోంది. ఎన్నోవిమర్శలు, ఎన్నో కాంప్లిమెంట్స్, ఎంతో హార్డ్ వర్క్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నా సినిమా ద్వారా మిమ్మల్ని మరింత ఎంటర్టెన్ చేస్తానని భావిస్తున్నాను. మీరు నాతోనే ఉన్నారు అని భావిస్తున్నాను.... అంటూ యాంకర్ రవి తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
మీ ప్రేమ కథలు పంపండి
సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మేఘనా లోకేష్‌తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది నా ప్రేమ కథ టీజర్
ఇప్పటి వరకు బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా ఆకట్టుకున్న యాంకర్ రవి.... సినిమా ద్వారా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాడని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇది నా ప్రేమకథ లేటెస్ట్ టీజర్ మీద మీరూ ఓ లుక్కేయండి.

ఇల్లు తాకట్టు పెట్టాం, చాలా కష్టపడ్డాం
‘ఇది నా ప్రేమ కథ' సినిమా విడుదల ఆలస్యానికి గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్యూలో రవి వెల్లడించారు. సినిమా చేయడం కంటే విడుదల చేయడమే చాలా కష్టమైందన్నారు.


Click it and Unblock the Notifications











