‘ఆగడు’ 75 కోట్లయితే...‘మగధీర’ రూ. 750 కోట్లు: వర్మ

By Bojja Kumar

హైదరాబాద్: ఎప్పుడో ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ....తాజాగా ‘ఆగడు' సినిమా చూసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘ఆగడు' సినిమా రూ. 75 కోట్ల సినిమా అయితే....మగధీర సినిమా రూ. 750 కోట్ల సినిమా అవుతుంది అని ట్వీట్ చేసారు.

‘జస్ట్ ఇప్పుడే ఆగడు సినిమా చూసాను. తర్వాత దూకుడు, బిజినెస్ మన్, పోకిరి సిమాలు చూస్తాను. మహేష్ బాబు సేమ్ చేసాడనే అనుకుంటున్నాను. ఆగడు సినిమా రూ. 75 కోట్ల సినిమా అయితే, మగధీర సినిమా 750 కోట్ల సినిమా అవుతుంది. ఆగడు, మగధీర సినిమా మధ్య నేను చేసిన పోలికి......ఆయా సినిమాలు చిత్రీరించిన టైం బట్టే' అని వర్మ వ్యాఖ్యానించారు. మరి వర్మ వ్యాఖ్యలపై ‘ఆగడు' సినిమా నిర్మాతలు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 If Aagadu Is 75 Cr, Magadheera Is 750 Cr: RGV

ఘట్టమనేని రమేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. దూకుడు లాంటి భారీ విజయం తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X