twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారం చేశానని నిరూపిస్తే కోటి రూపాయలిస్తా: సైరాభాను

    By Sindhu
    |

    వ్యభిచారం కేసులో పోలీసులకు చిక్కిన సైరాభాను, జ్యోతిలు సవాళ్లపై సవాళ్లు విసురుతున్నారు. సైరాభాను ఒకడుగు ముందుకు వేసి తాను వ్యభిచారం చేస్తున్నట్లు ఎవరైనా నిరూపిస్తే వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పెద్ద సవాల్ విసిరింది.

    తమకు ఎటువంటి పాపం తెలీదని కోర్టు ముందు చెప్పిన మీదట సైరాతోపాటు జ్యోతిని కోర్టు వదిలి వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సెక్స్ రాకెట్ ఉచ్చులో తాము అనుకోకుండా ఇరుక్కున్నట్లు సైరాభాను చెప్పుకొచ్చింది.

    సినీ నటీమణులు జ్యోతి, సైరాభాను సెక్స్ రాకెట్ లో రెడ్ హ్యాండెడ్ గానే దొరికారని స్పష్టం చేశారు నగర పోలీస్ కమీషనర్ ఎకె ఖాన్. ఈ విషయమై సినీ పరిశ్రమ నుంచి కొందరు పోలీసులపై చేస్తోన్న ఆరోపణల్లో నిజాలు లేవనీ, సినీ పరిశ్రమను పోలీసులు టార్గెట్ చేయనేలేదని, ఒకరిద్దరు సినీ పరిశ్రమకు చెందినవారు డ్రగ్స్, సెక్స్ రాకెట్లలో పట్టుబడినంతమాత్రాన మొత్తం సినీ పిరిశ్రమను బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఏకే ఖాన్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రాకెట్ పట్టుబడ్డాకే, ఆ కేసును తీగలాగితే, సెక్స్ రాకెట్ బయటపడిందనీ, ఈ రెండు రాకెట్లతోనూ సైరాభానుకి లింక్ వుందని ఏకే ఖాన్ అన్నారు.

    అయితే పోలీసులు మాత్రం వాళ్లిద్దరూ ఆ టైపు మనుషులేనని తెగేసి చెపుతున్నారు. వారు ఎంత వాదించినా నిజం అబద్ధం కాదనీ, అయినా దొంగతనం చేస్తున్న వ్యక్తితోపాటు కలిసి ఉన్న వ్యక్తి తాను దొంగను కాదని వాదిస్తే ఎవరు నమ్ముతారని వారు వాదిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X