Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డిజె లొల్లి: దమ్ముంటే ప్రూవ్ చేయ్, సినిమాలు మానేస్తా: హరీష్ శంకర్ సవాల్!
డిజె కలెక్షన్లపై హరీష్ శంకర్ సవాల్ విసిరారు. ఎవరైనా తప్పు అని నిరూపిస్తే సినిమాలు తీయడం మానేస్తానన్నారు.
హైదరాబాద్: 'డిజె' మూవీ పెద్ద ప్లాప్ సినిమా అని.... నిర్మాతలు చూపెడుతున్న కలెక్షన్లు అన్నీ ఫేక్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని వెబ్ సైట్లు కూడా ఇలాంటి వార్తలే రాస్తున్నాయి.
బాక్సాఫీసు వద్ద 13 రోజులు పూర్తి చేసుకున్న 'డిజె' నైజాంలో రూ. 20 కోట్ల మార్కును అందుకుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశం అయ్యాయి. ఎవరైనా ఈ వసూళ్ళ లెక్కలు తప్పు అని నిరూపిస్తే.... నేను సినిమాలు తీయడం మానేస్తాను, మరి మీరు మీ వెబ్ సైట్లు మూసుకుంటారా? అంటూ సవాల్ విసిరారు హరీష్.
|
తెలంగాణలో డిజె వసూళ్లు
నైజాం(తెలంగాణ) ప్రాంతంలో ‘డిజె' చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది, ఏ జిల్లాలో ఎంత రాబట్టింది అనే విషయాలు అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ వివరాలను ట్వీట్ చేస్తూ ఈ వసూళ్ల లెక్కలు తప్పు అని నిరూపిస్తే.... నేను సినిమాలు తీయడం మానేస్తాను, మరి మీరు మీ వెబ్ సైట్లు మూసుకుంటారా? అంటూ సవాల్ విసిరారు హరీష్.
|
గర్వంగా ఉంది.
నా కెరీర్లో నైజాంలో 20 కోట్లు వసూలు చేసిన రెండు సినిమాలు ఉండటం గర్వంగా ఫీలవుతున్నాను. అప్పుడు ‘గబ్బర్ సింగ్', ఇపుడు ‘డిజె' మూవీ ఈ ఘనత సాధించాయి అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.
|
పగతో తప్పుడు ఆర్టికల్స్ రాసి అవమానించారు
విమర్శలు ఎంత వరస్ట్ గా ఉన్నా నేను స్వీకరిస్తాను. కానీ నా సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్ల హార్డ్ వర్క్ శంకిస్తే మాత్రం సహించను. మాపై పగబట్టినట్లు ఫేక్ ఆర్టికల్స్ రాసి అవమానించారు అంటూ హరీష్ శంకర్ ఫైర్ అయ్యారు. పగతో తప్పుడు ఆర్టికల్స్ రాసి అవమానించారు.
|
యుద్ధం తప్పట్లేదు...
చివర్లో... ‘సారి గైస్ నేను సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్‌లోనే ఉన్నాను. ఇలాంటి ట్వీట్లు చేయాలని నాకు కూడా లేదు. కానీ తప్పట్లేదు... యుద్ధం శరణం గచ్చామి' అంటూ ట్వీట్ చేశాడు.
హరీష్ ట్వీట్లపై విమర్శలు
హరీష్ ట్వీట్లపై నెటిజన్ల నుండి ఎదురు దాడి మొదలైంది. నీ ఓవరాక్షన్ ఆపు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.