‘హ్యాపీడేస్’ హిట్ కాకుంటే...తమన్నా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా వచ్చి హిట్టైన చిత్రం 'హ్యాపీడేస్'. ఆ చిత్రంతో ఆగిపోయిందనుకున్న తమన్నా కెరీర్ మళ్లీ పట్టాలు ఎక్కింది. ఆ విషయాలను ఆమె గుర్తు చేసుకుంటూ... 'హ్యాపీడేస్' హిట్ కాకపోతే వెనక్కువెళ్లి ఏ ఎయిర్‌హోస్టెస్‌గానో ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను. అనుకోకుండా హిట్ వచ్చింది. హిట్ మీద హిట్టు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నా కెరీర్ చాలా బాగుంది. అయితే ఇదే శాశ్వతం అని నేను అనను అంటోంది తమన్నా కానీ అందం ఉన్నంతవరకూ ఇదే పొజీషన్ లో ఉండగలను. ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అయితే ఇంకా చాలా ఆఫర్స్ వచ్చాయి.. అయితే అవన్నీ ఒప్పుకుంటే దాదాపు ఇరవై సినిమాలు వరకూ అవుతాయి. కాబట్టి దాదాపు 2018 వరకూ నేను ఫుల్ బిజీ అంది.
అలాగే నేనింకా అలసిపోలేదు. నేను నంబర్‌వన్ పొజిషన్‌లో ఉన్నానో లేనో చెప్పలేనుకానీ, ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్నానని మాత్రం చెప్పగలను. ప్రస్తుతం తమన్నా రామ్ చరణ్, రామ్ చిత్రాలతో పూర్తిగా బిజీగా ఉంది. తన కెరీర్ ని విశ్లేషిస్తూ..కలకాలం సినీ రంగంలో కొనసాగాలి అని కంకణం కట్టుకోలేదు. ఉన్నంతలో మంచి పాత్రలు చేయాలి. సినీ రంగంలో పేరు సంపాదించుకొన్న హీరోయిన్స్ ను ఓసారి గమనించండి. వాళ్లు చేసిన వాటిలో ఎక్కువగా గ్లామర్ పాత్రలే. అయితే మధ్య మధ్యలో ప్రేక్షకుల దృష్టి మళ్లించారు. అలాంటి పాత్రలు లభిస్తే కెరీర్‌కు ఢోకా లేనట్టే అంది.కరెక్టే కావచ్చు.


Click it and Unblock the Notifications











