ఎన్టీఆర్ తో ఆ రూమర్ నిజమైతే హ్యాపీనే...తాప్సీ
ఎన్టీఆర్ లాంటి గ్రేట్ స్టార్‌తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే కదండీ. అదే నిజమైతే ఎంత బావుణ్నో. ఎన్టీఆర్ డాన్స్ అన్నా, ఆయన నటన అన్నా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆ వార్త నిజమైతే మాత్రం అది నాకు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా భావిస్తా అంటోంది తాప్సీ. ఎన్టీఆర్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న రచ్చ చిత్రంలో తాప్సీ నటించనుందనే వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఆమెను కలసిన మీడియాతో ఆమె ఇలా స్పందించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం తో పరిచయమైన ఈ పంజాబీభామ తాప్సీకి చేతినిండా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన దిల్ రాజు నిర్మిస్తోన్న మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రంలో ప్రబాస్ కి జోడీగానూ, విష్ణుకు జోడీగా వస్తాడు నారాజు చిత్రంలోను నటిస్తున్నారు. ఇవి గాక తమిళంలో ఓ చిత్రం, మలయాళంలో డబుల్స్ అనే సినిమాలు కమిటైంది.
తాప్సీ జూ ఎన్టీఆర్ రచ్చ వస్తాడు నా రాజు కాజల్ ఝుమ్మంది నాదం tapsi jr ntr rachcha vastadu naa raju kajal jhummandi naadam


Click it and Unblock the Notifications