»   » రాజమౌళి, పవన్ కలిసి సినిమా చేస్తే.. వర్మ ట్వీట్.. ఆర్జీవీ రోడ్డు మీద కుక్క..

రాజమౌళి, పవన్ కలిసి సినిమా చేస్తే.. వర్మ ట్వీట్.. ఆర్జీవీ రోడ్డు మీద కుక్క..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు, ఆసక్తికరమైన విషయాలను ప్రస్తవించడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మది ప్రత్యేకమైన రూటు. రెండురోజులుగా పవన్‌పై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్న వర్మ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు.

బాక్సాఫీస్ రికార్డు ఖాయం

ఒకవేళ ఎస్ఎస్ రాజమౌళి, పవన్ కల్యాణ్ కలిసి ఓ సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుగా నిలిచిపోతుంది. అలా జరుగాలని ఫ్యాన్స్ కోరుకొంటున్నారు అని ట్వీట్ చేశారు.

పవన్ టార్గెట్‌గా వర్మ విమర్శలు

పవన్ టార్గెట్‌గా వర్మ విమర్శలు

ఈ మధ్య మెగా ఫ్యామిలీపై రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేసి అనేక విమర్శల పాలయ్యాడు. తాజాగా కాటమరాయుడు రిలీజ్ సందర్భంగా పవన్ తో పాటు ఆయన అభిమానులపై కూడా సెటైర్ వేశాడు. పవన్ మూడు పెళ్లిళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఫ్యాన్స్ ని గేదెలతో పోల్చాడు.

ఇప్పుడే అద్భుతమైన వార్త విన్నాను.

స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరాన్, క్రిస్టఫర్ నోలన్ లాంటి హాలీవుడ్ ప్రముఖులు కాటమరాయుడు చిత్రాన్ని తమకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని కోరారు. పవన్ కల్యాణ్‌కు, ఫ్యాన్స్‌కు అభినందనలు వర్మ ఓ ట్వీట్ చేశారు.

వర్మ చవకబారు ట్వీట్స్

వర్మ చవకబారు ట్వీట్స్

ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ ట్విట్టర్ పైత్యం తీవ్రస్థాయికి చేరుకొన్నదనే మాట వినిపిస్తున్నది. అనవసర కామెంట్స్ చేసి వర్మ అందరి దృష్టిలో చులకనగా మారుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాంగోపాల్ వర్మ ట్వీట్లపై పవన్ కల్యాణ్ సన్నిహితుడు బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలకి వీరావేశంతో గణేశ్ ఊగిపోయారు.

నీవు రోడ్డు మీద కుక్కవు..

నీవు రోడ్డు మీద కుక్కవు..

‘నువ్వు కనీసం పవన్ కల్యాణ్ చెప్పుల విలువ చెయ్యవు. నోరు అదుపులో పెట్టుకో.. నీవు రోడ్డు మీద అరిచే కుక్క లాంటి వాడివి. నీవు కాలం తీరిన టాబ్లెట్‌తో సమానం.. నువ్వు టెర్రరిస్ట్ లాంటివాడివి. పవన్ కళ్యాణ్ తరపున మేమందరం సైనికులులా నిన్ను ద్వేషిస్తున్నామంటూ వరుస ట్వీట్స్ చేశాడు. చివరిగా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ తన బండ్ల గణేష్ ట్వీట్ల వర్షాన్ని' ముగించాడు.

బిగ్ బీతో సర్కార్3

బిగ్ బీతో సర్కార్3

కాగా బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో వర్మ తెరకెక్కించిన ‘సర్కార్‌ 3' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్‌ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో యామీ గౌతమ్‌, జాకీ ఫ్రాఫ్‌, మనోజ్‌ బాజ్‌పాయి కీలక పాత్రలు పోషించారు.

English summary
If Rajamouli and Pawan Kalyan do a film together it will be a box the office and record the breaks and as a fan I wish that to happen ASAP. Against Verma tweets producer Bandla Ganesh responded seriouly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu