రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ తొలి రోజు-తొలి షో మిస్ అయితే...!?
సినిమాలో మేటర్ ఏముంటుందోగానీ, ఇదో భీభత్సమైన స్టోరీ..ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. రక్తచరిత్ర టైటిల్ పెట్టడంతోనే సినిమాకి బోల్డంత క్రేజ్ తీసుకొచ్చేశాడు వర్మ. ఇక, రాయలసీమ ఫ్యాక్షనిజం..అందునా పరిటాల రవి-మద్దెల చెరువు సూరిల మధ్య వైరమే కథాంశమనడంతో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా..అని ఇటు పరిటాలా వర్గం, అటు సూరి వర్గం తెగ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
అదే సమయంలో, తమకేమాత్రం వ్యతిరేకంగా వున్నా, థియేటర్లలో బాంబుల మోత మోగించేందుకూ అనంతపురం జిల్లాలో సూరి, రవి అభిమానులు రెడీగా వున్నారన్నది నిర్వివాదాంశం. 'రక్త చరిత్ర"లో కేవలం, సూరి-రవిల మేటరే కారు..ఇంకా చాలా వుందంటూ తాజా వివాదాలు స్పష్టం చేస్తున్నారు. ఓబుల్ రెడ్డి గొడవ..'గుండు" రగడ..దాంతో పాటుగా సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్ర..ఇలా చెప్పుకుంటూ సినిమా నిండా వివాదాస్పద అంశాలు బోలెడు కావడంతో, సినిమాపై ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రేక్షకుల్లో.
అయితే, సినిమా విడుదలయ్యాక ఫస్ట్ షో తర్వాతే వివాదాలు మరింతగా రాజుకునే అవకాశం వుందనీ, తొలిరోజు తొలి షో మిస్సయితే, ఇక సినిమాలో అంతా కటింగుల పర్వమే తప్ప అసలు మేటర్ ఏమీ వుండదని సినీ జనం గుసగుసలాడుకొంటున్నారు. సో 'రక్తచరిత్ర"లో వర్మ ఏం చూపించాడని తెలుసుకోవాలంటే తొలిరోజు తొలి షో మిస్ కాకూడదన్నమాట.


Click it and Unblock the Notifications











